పక్కింటి లీడర్ కోసం బంగారంతో సహా పారిపోయిన భార్య !

illicit affair between politician and businessman wife

ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరి మీద పుడుతుందో తెలియందంటారు. కానీ నేటి సమాజం చూస్తుంటే అది ప్రేమ అనాలో కామం అనాలో అర్ధం కావడం లేదు గత ఏడాది కాలం నుండి నమోదవుతున్న వివాహేతర సంబంధాల కేసులు చూస్తే ఈ అనుమానం కలుగక మానదు. తాజాగా తమ పొరుగు ఇంట్లో ఉన్న ఓ చోటా రాజకీయ నేతతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యాపారి భార్య, అతని కలిసి బతికేందుకు ఇంట్లోని 150 సవర్ల బంగారు నగలను తీసుకుని పారిపోయిన ఘటన తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో సంచలనం కలిగిస్తోంది. మార్తాండం పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, మార్తాండం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి (50) ఫైనాన్స్ కంపెనీని నిర్వహిస్తుండగా, అతనికి భార్య (40), ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

forced-sex-with-wife-is-also-illegal
వారింటి పక్కనే వివాహమై భార్యా, పిల్లలున్న ఓ రాజకీయ పార్టీ ప్రముఖుడు ఉంటున్నాడు. వ్యాపారికీ నాయకుడికీ మధ్యా వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి దీంతో వారు తరచూ కలుసుకునేవాళ్లు. ఈ క్రమంలో వ్యాపారి భార్యతో రాజకీయ నేతకి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన వ్యాపారి వారిని మందలించడంతో బుధవారం నాడు తన ఇంట్లోని 150 సవర్ల బంగారం నగలతో ఆమె అదృశ్యం అయింది. తన ప్రియుడితో కలసి ఆమె పారిపోయినట్టు విచారణలో వెల్లడికాగా, వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.