నన్ను తీసుకెళ్లండి.. జైల్లో ఉండలేకపోతున్నా..లాయర్లకు ఇమ్రాన్ ఖాన్ మొర.

Former Prime Minister of Pakistan Imran Khan
Former Prime Minister of Pakistan Imran Khan

తోషాఖానా కేసులో దోషిగా తేలిన పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అటక్‌ జైలులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే జైల్లో వసతులపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పురుగులు ఇబ్బంది పెడుతున్నాయని,మూడో తరగతి ఖైదీలను ఉంచే గదిలో తనను ఉంచారని, తనను కలవడానికి వచ్చిన న్యాయవాది నయీమ్‌ హైదర్‌కు ఇమ్రాన్‌ తెలిపారు. ఆ జైల్లో తాను ఉండలేకపోతున్నానని.. ఎలాగైనా ఇక్కడి నుంచి తనను బయటికి తీసుకెళ్లాలని ఇమ్రాన్‌ కోరినట్లు పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ (పీటీఐ) వర్గాలు తెలిపాయి. అదియాల్‌ జైలుకు తరలించ ముందు అటక్‌ జైలు తమ నాయకుడిని సౌకర్యాలు మెరుగ్గా లేవని మార్చమని పీటీఐ ఇప్పటికే ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఇమ్రాన్‌ న్యాయవాదుల బృందం కూడా జైల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇమ్రాన్‌ ఎన్నేళ్లు తనను జైలులో ఉంచినా.. ఉండటానికి సిద్ధమని… మానసిక స్థైర్యం కోల్పోలేదని తెలిపారని పేర్కొంది.ఈ కేసుపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది