రాజకీయ పార్టీలకి నిజమయిన పిల్లర్స్ నేతలు కాదు, కార్యకర్తలే ఇదే విషయాన్నీ మరోసారి రుజువు చేశారు, మధ్యప్రదేశ్ కు చెందిన ఒక కార్యకర్త. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త తాను చేసిన శపథానికి కట్టుబడి 15 ఏళ్ళ పాటు చెప్పులు లేకుండా తిరిగాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకు గాను కాంగ్రెస్ కేవలం 38 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ సమయంలో దుర్గాలాల్ అనే కాంగ్రెస్ కార్యకర్త రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేసాడు.
అయితే ఆయన దురదృష్టమో బీజేపీ అదృష్టమో గానీ మూడు పర్యాయాలు బీజీపీనే గెలుపొందింది. దీంతో ఆయన ఈ 15 ఏళ్లు చెప్పులు లేకుండానే తిరిగారు. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దుర్గాలాల్ తన 15 ఏళ్ల శపథానికి స్వస్తి పలికి, కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ సమక్షంలో దుర్గాలాల్ బూట్లు వేసుకున్నారు.