Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
69వ రిపబ్లిక్ వేడుకలకు దేశం సిద్ధమవుతోంది. సోషల్ మీడియా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభించింది. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ రిపబ్లిక్ డే కోసం ప్రత్యేకంగా ఓ ఎమోజీ రూపొందించింది. Republic Day , Happy Republic Day, Republic Day 2018 హ్యాట్యాగ్ లు వాడితే ఇండియా గేట్ ఎమోజీ ప్రత్యక్షమయ్యేలా ట్విట్టర్ ప్రోగ్రామ్ చేసింది. జనవరి 29వరకు ఈ ఎమోజీ అందుబాటులో ఉండనుంది. రిపబ్లిక్ డే పరేడ్ కు ముందు ప్రధాని ఇండియా గేట్ వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు.
అందుకే ఈ వేడుకను పురస్కరించుకోవడానికి ఎమోజీగా ఇండియా గేట్ ఎంచుకున్నట్టు ట్విట్టర్ ఇండియా తెలిపింది. రిపబ్లిక్ డేను ఇండియా గేట్ ఎమోజీతో ట్విట్టర్ సెలబ్రేట్ చేస్తుండడం చాలా గర్వంగా ఉందని, దేశ ప్రజల ఏకత్వాన్ని ఈ ఎమోజీ ప్రతిబింబిస్తోందని ట్విట్టర్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ మహిమా కౌల్ అన్నారు. ఈ ఎమోజీని ఉపయోగించి రక్షణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. నెటిజన్లు కూడా ఈ ఎమోజీని ఉపయోగిస్తుండడంతో ట్రెండింగ్ గా మారింది.