ఇక పద్మావత్‌కు అడ్డులేదు

positive talk on padmavat movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పద్మావత్‌’ చిత్రం ఎన్నో వివాదాల నడుమ విడుదలకు సిద్దం అయ్యింది. రాజ్‌పూత్‌ వంశస్తులు మరియు ఇంకా పలు హిందూ సంఘాల వారు ఈ చిత్రం విడుదలకు అడ్డంకులు చెబుతూ వచ్చారు. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. రేపు అంటే జనవరి 25న చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌లో దీపిక పదుకునే నటించగా హీరోగా షాహిద్‌ కపూర్‌ విలన్‌గా రణవీర్‌ సింగ్‌ నటించాడు. ఈ చిత్రం రాజ్‌పూత్‌ వంశస్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమాను విడుదల కానిచ్చేది లేదు అంటూ వారు ఆందోళనలు నిర్వహించారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ చిత్రంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయితే దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాల్సీ ఈ చిత్రంలో ఎలాంటి అభ్యంతరకర సీన్స్‌ లేవని, ఈ చిత్రాన్ని చూసిన తర్వాత రాజ్‌పూత్‌లు నిర్ణయం తీసుకోవచ్చు అంటూ సూచించాడు. ఇక సెన్సార్‌ వారు కూడా ఒకటికి రెండు సార్లు ప్రతి సీన్‌ను చూసి, వివాదాస్పద సీన్స్‌కు కతెత్తర వేసి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది. సుప్రీం కోర్టు కూడా ఈ చిత్రానికి క్లీన్‌ చీట్‌ ఇచ్చాడు.

పదుల సంఖ్యలో పిటీషన్‌లు ఈ చిత్రం విడుదలను అడ్డుకుంటూ నమోదు అయ్యాయి. అన్ని పిటీషన్‌లను కూడా సుప్రీం కోర్టు కొట్టి వేసి సినిమా విడుదలకు అడ్డు చెప్పలేం అంటూ తేల్చి చెప్పింది. దాంతో రేపు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్య థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు ముఖ్య పట్టణాల్లో సినిమా ప్రీమియర్‌లను కూడా వేయడం జరిగింది. సినిమాకు ఇప్పటికే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. దాంతో సినిమా తప్పకుండా మంచి కలెక్షన్స్‌ను సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.