అజ్ఞాతవాసి నిర్మాత మంచి మనస్సు

Producer Radhakrishna Hopes To Pay Rs 15 Crores To Distributors

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం అవ్వడంతో పాటు, ఆ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన నేపథ్యంలో ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై అంచనాలు ఆకాశానిన తాకేలా వచ్చాయి. దాంతో సినిమాను అన్ని ఏరియాల్లో కలిపి ఏకంగా 125 కోట్లకు గాను నిర్మాత అమ్మడం జరిగింది. తీరా సినిమా విడుదలైన తర్వాత కనీసం 60 కోట్లు కూడా వసూళ్లు చేయడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ఇక ముందు కూడా కలెక్షన్స్‌ వస్తాయన్న నమ్మకం లేదు. మొత్తాంగా ఈ చిత్రం దాదాపు 65 కోట్ల వరకు నష్టంను డిస్ట్రిబ్యూటర్లకు మిగిల్చింది.

ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ డిస్ట్రిబ్యూటర్ల నష్టాన్ని భర్తీ చేసేందుకు తనవంతు సాయంగా 10 కోట్లను తిరిగి ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. పవన్‌తో పాటు త్రివిక్రమ్‌ కూడా తన పారితోషికంలో 5 కోట్లను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక నిర్మాత రాధాకృష్ణ 15 కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని భావిస్తున్నాడు. అంటే మొత్తంగా 30 కోట్ల మేరకు డిస్ట్రిబ్యూటర్ల నష్టాన్ని పూడ్చేందుకు హీరో, దర్శకుడు, నిర్మాత ముందుకు వచ్చారు. ఇక డిస్ట్రిబ్యూటర్ల నష్టం స్వల్పంగానే ఉంటుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని సినీ వర్గాల వారు అంటున్నారు. ఏ డిస్ట్రిబ్యూటర్‌కు ఎంత మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలి అనే విషయంపై పవన్‌తో నిర్మాతలు చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.