ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో 63వ స్ధానం భారత్ సాదించింది. 14 దేశాలను అధిగమించి మెరుగైన స్ధానంను పొందింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన సంస్కరణలతో ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన సులభతర వాణిజ్యంలో మెరుగైన 63వ ర్యాంక్‌లో నిలిచింది. మేకిన్ ఇండియాతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన భారత్ వరుసగా మూడోసారి టాప్ టెన్ దేశాలతో అరుదైన ర్యాంక్ పొందింది.
భారత వృద్ధి రేటును ఆర్బీఐ, ప్రపంచ బ్యాంక్, ఐఎంఫ్ తగ్గించిన కూడా ఈ ర్యాంక్ పొందడం విశేషం. 2014లో భారత్ 190 దేశాలతో కూడిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 142వ స్ధానంలో నిలిచింది. నాలుగేళ్ల తర్వాత 100వ స్థానం పొందింది. ఇపుడు భారత్ ఏకంగా 23 ర్యాంకులు ముందుకు వెళ్ళి 77వ స్థానం దక్కించుకుంది. వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనమిక్స్‌కు చెందిన సైమన్ డిజన్‌కోవ్ ప్రశంసింస్తు టాప్10 దేశాల జాబితాలో వరుసగా మూడోసారి భారత్ చోటు దక్కించుకుందని వెల్లడించారు.