శిశుమరణాలలో టాప్ లో భారత్

శిశుమరణాలలో టాప్ లో భారత్

ప్రపంచంలో అండర్ ఫైవ్ శిశుమరణాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ టాప్ లో నిలిచింది. పుట్టిన తర్వాత ఐదేళ్ల లోపు చనిపోతున్న శిశుమరణాలు 2017 లో పది లక్షల మరణాలతో ప్రపంచం లోనే భారత్ మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానం లో నైజీరియా, పాకిస్తాన్, కాంగో దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ పరిశోధనా జర్నల్ “నేచర్” లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

1950లో 19.6 మిలియన్ల మరణాలు నమోదు అయ్యాయి. 2017 నాటికి ఇవి తగ్గి 5.4 మిలియన్లకి చేరింది. అల్ప ఆదాయ, మద్య ఆదాయ దేశాల్లోనే 93 శాతం నమోదు అయ్యాయి. దీని పట్టి శిశు మరణాలు తగ్గిపోతున్నాయే చెప్పుకోవచ్చు. కాని భారత్ టాప్లో నిలిచింది. మన  దేశంలో సంభవించిన శిశుమరణాలు చాలా ఎక్కువ, దాదాపు 1.04 మిలియన్ల మరణాలు జరిగాయని “నేచర్” జర్నల్ తెలిపింది.

ఇండియాకు సంబంధించి 2015 లో శిశుమరణాలు ప్రతి వేయి జననాలకు 43 మరణాలుగా ఉండగా.. 2016 లో 39 కి చేరింది. ఈ రీసెర్చ్ పేపర్ రాసిన సీనియర్ రచయిత “సైమన్ హే” దీనినిపట్టి 15 వేల మంది భారత్ లో ప్రతి రోజూ చనిపోతున్నారని తెలిపారు.