అక్టోబర్ 22న బ్యాంక్ ల సమ్మె

అక్టోబర్ 22న బ్యాంక్ ల సమ్మె

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగులు ప్రభుత్వం రంగ జాతీయ బ్యాంక్ ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఒక రోజు జాతీయ సమ్మె చేయబోనున్నారు. అక్టోబర్ 22న జరుగుతున్న ఈ సమ్మె జరగనుంది. హిమాయత్ నగర్ లోని కామ్రేడ్ సత్యనారాయణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు ఇంకా బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కలిసి చర్చించారు.

కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నాలుగు బ్యాంక్లుగా విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాంబాబు నిరసిస్తున్నట్టు తెలిపారు. నిరసనగా అక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు ​బ్యాంక్ల​ సమ్మె చేయబోనున్నట్టు తెలిపారు.

పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ల విలీనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 కు తగ్గనుంది. ​గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కూడా తగ్గిపోతుంది అని చెప్పారు. ఉద్యోగులు తగ్గిపోయి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని, కార్పొరేట్ సంస్థలకు దగ్గర అవ్వడానికి కేంద్రప్రభుత్వం ​బ్యాంక్ల సంస్కరణలు చేపడుతుందని అన్నారు.