Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటికే టెక్నాలజీ పరంగా ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీపడుతున్న ఇండియా ఇప్పుడు మరో కలికితురాయిని దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యూజర్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. చివరకు అగ్రరాజ్యం అమెరికాను కూడా తోసిరాజనడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అన్నిచోట్లా ఫేస్ బుక్ యూజర్లు ఎక్కువగానే ఉన్నారు.
ఫేస్ బుక్ యూజర్లు అన్ని దేశాల కంటే భారత్ లోనే ఎక్కువగా పెరుగుతున్నారు. చివరకు అమెరికాలో కూడా వృద్ధిరేటు పడిపోతోంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే సంతృప్త స్థాయి వచ్చేసింది. అందుకే అమెరికా కంపెనీలన్నీ తమ రెండో గమ్యస్థానంగా భారత్ ను చేసుకుంటున్నాయి. ఇలా ఓ నాలుగైదు కంపెనీలు వచ్చేస్తే… ఇక మిగతా కంపెనీలు అవే వస్తాయనేది అందరి ఆలోచన.
ఐటీ సెక్టార్లో లీడర్ గా ఉన్న భారత్… ఇప్పుడు ఫేస్ బుక్ యాక్టివ్ యూజర్ల జాబితాలోనూ బెస్ట్ అనిపించుకుంది. అమెరికాకు 240 మిలియన్ల యూజర్లుంటే… ఇండియాలో ఏకంగా 241 మిలియన్ల మంది యూజర్లున్నారు. అమెరికాలో వృద్ధిరేటు తగ్గుతుంటే… భారత్ లో మాత్రం బాగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఒక్క ఫేస్ బుక్ మాత్రమే కాదు… టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో భారత్ అగ్రస్థానం కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు