దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు

దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు

భారత్‌లో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 1700 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 639 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంట్లలో 170కిపైగా ఒమిక్రాన్‌ కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌ కేసుల్లో మహారాష్ట్ర టాప్‌ ప్లేస్‌లో ఉంది. మహారాష్ట్రలో 510 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 351 ఒమిక్రాన్‌ కేసులు వచ్చాయి.

ఇదిలా ఉంచితే భారత్‌లో గడిచిన 24 గంటల్లో 33, 750 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 123 మంది మృత్యువాత పడగా 10, 846 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1, 45, 582 యాక్టివ్‌ కేసులున్నాయి. మరొకవైపు టీనేజర్లకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. 15 సంవత్సరాల వయసు నుంచి 18 ఏళ్ల వయసు వారికి కరోనా వాక్సినేషన్‌ ఇస్తున్నారు.