చైనా వెబ్ సిరీస్ లో శాన్వి

Indian actress shanvi srivastava in Chinese web series

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ల‌వ్లీ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన శాన్వి ఎందుక‌నో ఇక్క‌డ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయింది. అందం, అభిన‌యం అన్నీ ఉన్నా తెలుగులో ఆమెకు అదృష్టం క‌లిసిరాలేదు. రాంగోపాల్ వ‌ర్మ సినిమాలో చేసిన ఐటెంసాంగ్ కూడా ఆమె కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. దీంతో శాన్వి టాలీవుడ్ ను వ‌దిలేసి క‌న్న‌డ సినిమాల‌పై దృష్టిపెట్టింది. శాండ‌ల్ వుడ్ లో వ‌రుస అవ‌కాశాలతో దూసుకుపోతోంది. ఇప్పుడు క‌న్న‌డ‌లో క్రేజీ హీరోయిన్ గా ఉన్న శాన్వి అంత‌ర్జాతీయ స్థాయిలో ల‌క్కీ చాన్స్ కొట్టేసింది. చైనీస్ వెబ్ సిరీస్ లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది.

shanvi

ది డార్క్ లార్డ్ పేరుతో తెర‌కెక్కుతోన్న చైనీస్ వెబ్ సిరీస్ లో శాన్వి భార‌తీయ యువ‌రాణిగా న‌టిస్తోంది. వెబ్ సిరీస్ షూటింగ్ ఫొటోల‌ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా వెబ్ సిరీస్ ల హ‌వా న‌డుస్తోంది. వెండితెర‌, బుల్లి తెర న‌టీన‌టులెంద‌రో వెబ్ సిరీస్ ల్లో న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఓ భార‌తీయ న‌టి..అందునా దక్షిణాది సినిమాల హీరోయిన్ చైనా వెబ్ సిరీస్ లో న‌టిస్తుండ‌డం బ‌హుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఈ వెబ్ సిరీస్ తో శాన్వి చైనాలో గుర్తింపు పొంద‌నుంది.