చైనా దిగ్గజంపై తెలుగు తేజం గెలుపు

చైనా దిగ్గజంపై తెలుగు తేజం గెలుపు

భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి ఆటగాడు, తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌గా ఐదు సార్లు నిలిచిన చైనా ఆటగాడు లిన్‌ డాన్‌ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టనున్నాడు.

ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో బరిలోకి వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయిప్రణీత్‌, పీవీ సింధు కలిసి డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీని శుభారంభం చేశారు. ప్రపంచ 12వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 36 నిమిషాల్లో పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 21–14, 21–17తో ప్రపంచ 18వ ర్యాంకర్,మాజీ నంబర్‌వన్ లిన్‌డాన్‌పై విజయం సాధించాడు.లిన్‌ డాన్‌తో గతంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన సాయిప్రణీత్‌ ఈసారి విజయం పొందాడు.ఇపుడు చైనాదిగ్గజం లిన్‌డాన్‌ను కనీసం ఒక్కసారి ఓడించిన ప్లేయర్స్ లో నాలుగో భారత  ప్లేయర్‌గా సాయిప్రణీత్‌ నిలిచాడు.