Posted [relativedate]
పదిహేడెళ్ల బుడతడు రెండు మూడు క్లిక్‌లతో భారత ఎంబసీ వెబ్‌సైట్‌నే హ్యాక్ చేస్తానంటూ ఛాలెంజ్‌చేశాడు.. దాన్ని నిరూపించేందుకు ఇండియన్ డిప్లొమాటిక్ మిషన్ వెబ్‌సైట్‌ను మూడు సెకన్లలో హ్యాక్ చేసి చూపించాడు. ప్రపంచమంతా భద్రత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే మన ఎంబసీ మాత్రం వెబ్‌సైట్‌ని నామమాత్రంగా రన్ చేస్తున్నట్లు ఈ కుర్రాడు గుర్తించాడు అంతే అధికారులకు ఒక లెసన్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాడట.. అమెరికాలోని దౌత్య కార్యాలయంతో పాటు సౌత్‌ఆఫ్రికా, లిబియా, మలావి, మాలి, ఇటలీ, స్విట్జర్లాండ్, రుమేనియా దేశాల్లోని ఎంబసీల వెబ్‌సెట్లు సైతం ఇదే రీతిలో ఉన్నాయన్నాడు. ఇంత చేసిన ఈ కుర్రాడు తన వివరాలను మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు.. తాను టోక్యోలో చదువుతున్నట్లు.. కపుస్టికి పేరుతో ట్విటర్ ద్వారా వివరాలు ట్వీట్ చేశాడు.. కపుస్టికి చేసినపనికి ఎంబసీ నుంచి సానుకూల సందేశమే వచ్చినట్లు.. వెబ్‌సైట్‌లలోని లోపాలను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూఎంబసి పంపిన సందేశాన్నీ ట్వీట్ చేశాడు… ఈ దెబ్బతో అధికార్లు వీటిని సరిదిద్దే పనిలో పడ్డారు. ఈ ప్రయత్నంలో నిమగ్నమైనట్లు ఈ-గవర్నెన్స్ జేసీ సంజయ్‌కుమార్ వర్మ పేర్కొన్నారు. దానితోపాటు తమ వెబ్‌సైట్‌లోని సమాచారం చాలా భద్రంగా ఉందని కూడా తెలిపారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది.