ఆస్ట్రేలియాలో ప్రియుడి చేతిలో హతమైన తెలుగు డాక్టర్ !

Indian origin Doctor Prithi Reddy Murder by EX Boyfriend

ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న భారత దేశానికీ చెందిన వైద్యురాలు ఒకరు దారుణహత్యకు గురయ్యారు. సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్‌బ్రూక్ డెంటల్ హాస్పిటల్‌లో ప్రీతిరెడ్డి(32) సర్జన్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం ఓ హోటల్‌లో బసచేసిన ఆమె అక్కడ నుండి కనిపించకుండా పోయారు. దీనిపై కేసు నమోదుకావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె కోసం గాలింపు చేపట్టగ మంగళవారం రాత్రి ఓ కారులోని సూట్‌కేసులో శవమై కనిపించారు. ఆమె శరీరంలో అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ప్రీతిరెడ్డి సిడ్నీలోని మార్కెట్ స్ట్రీట్‌లో గల ఓ హోటల్‌లో తన మాజీ ప్రియుడితో కలిసి దిగారు. అయితే మంగళవారం రాత్రి ఆ హోటల్ కి 340 కిలోమీటర్ల దూరంలో తన కారులోనే సూట్‌కేసులో శవమై కనిపించారు. మాజీ ప్రియుడే ప్రీతిరెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడిని డాక్టర్ హర్ష్ నర్డేగా గుర్తించారు.