ధోనీకి ఇకపై జట్టులో చోటు దక్కడం కష్టమే అని టీమిండియా సెలక్టర్లు తేల్చి చెప్పేశారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఆట ఆడుతాడా రిటైర్మెంట్ తీసుకుంటాడా అనేది తేల్చి చెప్పాలని భారత సెలక్టర్లు కోరారు.
భారత సెలక్టర్లు బంగ్లాదేశ్‌తో టీ20, టెస్టు సిరీస్ కోసం జట్టుని ఎంపిక చేశారు. టీ20ల కోసం ధోనీని ఎంపిక చేయలేదు. ఇలాగే ఉంటే భారత్ జట్టుకి ధోనీ ఎంపికవడం కష్టమే అని చెప్పేశారు. రిషబ్ పంత్‌తో పాటు మరో వికెట్ కీపర్ సంజు శాంసన్‌ని బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కి జట్టులోకి భారత సెలక్టర్లు ఎంపిక చేశారు.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇంకా ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఉన్న రిషబ్ పంత్ ఇప్పుడు జట్టు మొదటి ప్రాధాన్యత కీపర్‌గా భాద్యత వహించనున్నాడు.బీసీసీఐ కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చలు జరిపాక సెలక్టర్లు భారత్ జట్టుని ఎంపిక చేశారు. ధోనీ వరల్డ్ కప్ తర్వాత తర్వాత టీమిండియాకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తీసుకోబోతున్నార లేదా మళ్ళీ ఆడుతార అనేది ధోనీనే ప్రకటించాలని చెప్పారు. అతని భవిష్యత్ తన చేతుల్లోనే ఉందని అన్నారు.