2017లో భార‌త క్రికెట్ కు మ‌ర‌పురాని విజ‌యాలు

Inidan Cricket Recorded Best in 2017

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈ ఏడాది అప్ర‌తిహ‌త విజ‌యాలు సాధించిన భార‌త క్రికెట్ జ‌ట్టు చివ‌రి మ్యాచ్ కూడా విజ‌యంతో ముగించింది. శ్రీలంకతో ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన చివ‌రి టీ 20లో ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. శ్రీలంక ఏడు వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేయ‌గా..రోహిత్ సేన 19.2 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. 2017 ఏడాది భార‌త క్రికెట్లో  ఎప్ప‌టికీ నిలిచిపోతుంది. టెస్ట్ , వ‌న్డే సిరీస్ ల్లో భార‌త్ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. తిరుగులేని విజ‌యాల‌తో స్వ‌దేశీ సీజ‌న్ ను టీమిండియా దాదాపు క్లీన్ స్వీప్ చేసింది.  ఈ సంవ‌త్స‌రంలో సుదీర్ఘ క్రికెట్ ఆడిన భార‌త్ ఏకంగా పది సిరీస్ లు గెలిచింది. మొత్తం 11 సిరీస్ లు ఆడ‌గా ఏ ఫార్మ‌ట్ లోనూ సిరీస్ ఓట‌మి లేదు. 3 టెస్ట్ సిరీస్ ల్లో, 4 వ‌న్డే సిరీస్ ల్లో, 3 టీ20 సిరీస్ ల్లో గెలుపొందింది. ఆస్ట్రేలియాతో ఒక టీ20 సిరీస్ మాత్రం 1-1తో స‌మమైంది. భార‌త్ ను 2017 అంత‌ర్జాతీయ క్రికెట్ లో స‌గ‌ర్వంగా నిల‌బెట్టింద‌ని చెప్పొచ్చు. ఈ  ఏడాది సాధించిన విజ‌యాల‌తో మేటిజ‌ట్లుగా భావించే ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి జ‌ట్ల క‌న్నా భార‌త్ ఇప్పుడు బ‌ల‌మైన జ‌ట్టుగా క‌నిపిస్తోంది.

ముఖ్యంగా ఆస్ట్రేలియాకు 2017 భార‌త ప‌ర్య‌ట‌న ఓ చేదు జ్ఞాప‌కం. స్వ‌దేశంలో అయినా, విదేశంలో అయినా ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డే కంగారూలు భార‌త ప‌ర్య‌ట‌న‌లో మాత్రం చేతులెత్తేశారు. గ‌త ప్రాభ‌వాన్ని కోల్పోయిన ఆస్ట్రేలియా ఏ స్థితిలో ఉందో భార‌త ప‌ర్య‌ట‌న అంత‌ర్జాతీయ క్రికెట్ కు తెలియజేసింది. భార‌త క్రికెట‌ర్ల ధాటికి ఆస్ట్రేలియ‌న్లు టెస్టు, వ‌న్డే సిరీస్ ల్లో ఏ మాత్రం పోటీఇవ్వ‌లేక‌పోయారు.  భార‌త్ తో మ్యాచ్ ముందురోజు ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల‌కు నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ని స్వ‌యంగా కంగారూల తాత్కాలిక కోచ్ ప్ర‌క‌టించ‌డం విశేషం. ఒక్క ఆస్ట్రేలియానే కాదు…మిగిలిన జ‌ట్ల‌న్నింటి క‌న్నా మ‌న జ‌ట్టే ఇప్పుడు బ‌లోపేతంగా క‌నిపిస్తోంది. స‌రిగ్గా చెప్పాలంటే ఒక‌ప్పుడు వెస్టెండీస్, త‌ర్వాత ఆస్ట్రేలియా ప్ర‌పంచ క్రికెట్ ను ఎలా శాసించాయో..భార‌త్ ఇప్పుడు ఆ స్థితిలో ఉంది. తుది జ‌ట్టులో ఆడే ప‌ద‌కొండుమందే కాక‌..ప్రాబ‌బుల్స్ లో ఉన్న‌వాళ్లు కూడా మంచి ఫామ్ లో ఉంటున్నారు. వ‌చ్చిన అవ‌కాశాల‌ను యువ‌కులు చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటున్నారు.
 Inidan Cricket Recorded Best in 2017
జ‌ట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ నెల‌కొంది. ఈ ఏడాది భార‌త జ‌ట్టులో మ‌రో కీల‌క మార్పు కూడా చోటుచేసుకుంది. అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోనీ నుంచి కోహ్లీ జ‌ట్టు ప‌గ్గాలు స్వీక‌రించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. అదే సమ‌యంలో ఆయ‌న గైర్హాజ‌రీలో వ‌చ్చిన అవ‌కాశాన్ని రోహిత్ శ‌ర్మ స‌ద్వినియోగం చేసుకున్నాడు. అటు ఈ ఘ‌న‌త‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే ఈ ఏడాది భార‌త జ‌ట్టుకు అత్యంత అవ‌మాన క‌ర ప‌రిణామం కూడా ఎదుర‌యింది. విరాట్ కోహ్లీ పెళ్లికోసం జ‌ట్టుకు దూర‌మ‌వ‌డంతో రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో తొలి వ‌న్డే ఆడిన భార‌త్  అత్యంత దారుణ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. జ‌ట్టులోని 11 మంది ఆట‌గాళ్లు క‌లిపి 50 ఓవ‌ర్ల‌లో చేసింది కేవ‌లం 112 ప‌రుగులే. ధోనీలాంటి అనుభ‌వ‌జ్ఞుడు వ‌ల్ల ఆ మాత్రం గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ అయినా న‌యోద‌యింది. ఇది మిన‌హా ఈ ఏడాది భార‌త జ‌ట్టులో చేదు అనుభ‌వాలేమీ లేవు. తొలి వ‌న్డేలో ఓడిపోయినా..త‌ర్వాత భార‌త్ అనూహ్యంగా పుంజుకుంది. త‌ర్వాతి రెండు వ‌న్డేల్లో ఘ‌న‌విజ‌యం సాధించింది.  వ‌న్డే, టీ20 సిరీస్ ల్లో సాధించిన విజయం  తో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు భార‌త్ అత్యంత ఆత్మ‌విశ్వాసంతో బ‌యలుదేరుతోంది.