Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రింట్ మీడియా హిస్టరీలో ఈనాడుదు తిరుగులేని స్థానం. మూడు దశాబ్దాలుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఈనాడు.. ఎన్ని కొత్త పేపర్లు వచ్చినా.. వాటన్నింటికీ అందనంద దూరంలో ఉంది. దీనికి రామోజీరావు తిరుగులేని వ్యూహాలు, ఈనాడు ఎడిటోరియల్ టీమ్ నైపుణ్యం కూడా కలిసివచ్చాయి. ఏ సమయంలో ఏ వార్తలు రాయాలో ఈనాడుకు తెలిసినట్లు మరే పేపర్ కు తెలియదు. రీసెంట్ గా మియాపూర్ భూస్కాం గురించి కూడా ఈనాడు హైలైట్ చేశాకే మిగతా పేపర్లు అందుకున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉన్నా ఈనాడు చదివి తీరాల్సిన పరిస్థితి ఉంది. కానీ సాక్షి వచ్చాక పరిస్థితి కాస్త మారినట్లు కనిపిస్తోంది. సాక్షి ఈనాడుకు గట్టిపోటీ ఇచ్చినా.. తర్వాత చతికిలబడింది. దీంతో మళ్లీ ఈనాడు తిరుగులేని స్థానాన్ని ఎంజాయ్ చేస్తోంది. కానీ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రజ్యోతి బలం పుంజుకుందని తెలుస్తోంది. చిన్న గ్రామాల్లో ఈనాడు, జ్యోతి మధ్య తేడా తగ్గిపోతుందనేది ఇన్ సైడ్ టాక్.
కానీ ప్రతిదానికీ కంగారు పడే నైజం రామోజీది కాదు. ఆయనకు తన పేపర్ ను ఎలా నంబర్ వన్ గా ఉంచాలో బాగా తెలుసు. ఇప్పటికే స్ట్రాటజీ రెడీ చేసి ఉంటారని ప్రింట్ మీడియా నిపుణులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కూడా ప్రముఖ పత్రికగా ఉన్న ఈనాడు పడిపోవడం జరగదని, అయితే ఒడిదుడుకుల్ని తట్టుకునే వ్యవస్థ కూడా అందుబాటులో ఉందని అంటున్నారు. మరి ఎన్నికల నాటికి ఆంధ్రజ్యోతి ఇదే దూకుడు కంటిన్యూ చేసి.. సర్క్యులేషన్ పెంచుకుంటుందా.. లేదంటే పాలపొంగులాగా తేలిపోతుందా అనేది చూడాల్సి ఉంది.