భారత్‌లో నివసిస్తున్న కెనడా పౌరులకు సూచనలు..

Go to your country..Threats to Hindus in Canada..
Go to your country..Threats to Hindus in Canada..

ఖలిస్థాని వివాదం భారత్-కెనడాల మధ్య చిచ్చు పెట్టింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనక భారత్‌ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆ దేశంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటువేయగా, దానికి గట్టిగా బదులిస్తూ.. భారత్‌ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్‌లో పర్యటిస్తున్న తమ పౌరులకు కెనడా పలు హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారత్‌లో ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. రక్షణ, భద్రతా సమస్యలు ఎప్పుడైనా ఉత్పన్నం కావచ్చని చెప్పింది.

నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక అధికారుల సూచనలను మీడియాలో ఎప్పటికప్పుడు అనుసరించాలని.. అత్యవసరం అయితే తప్ప భారత్‌ ప్రయాణం చేపట్టవద్దని.. తమ భద్రతను ప్రమాదంలో పెట్టవద్దని పేర్కొంది. ఈ మేరకు కెనడా తన ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఈ వివరాలు వెల్లడించింది