మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

Modi should give national status to Ranga Reddy upliftment: Minister KTR
Modi should give national status to Ranga Reddy upliftment: Minister KTR

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న వేళ మరోసారి ఈ అంశంపై మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పార్కును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై స్పందించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. మహిళా నేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మన జీవితాలు చాలా చిన్నవని… తన పాత్ర తాను పోషించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ల అమలులో తన సీటు పోయినా…. వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

“మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం జరుగుతోంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా ముమ్మరంగా పోరాడింది. దిల్లీకి పోయి కొట్లాడినం. ఎట్టకేలకు ఈ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టడం సంతోషకరం. ఈ బిల్లును మేం పూర్తిగా స్వాగతిస్తున్నాం. చట్టసభల్లో మహిళా నేతలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ రిజర్వేషన్​తో నా సీటు పోయినా.. వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను.” అని మంత్రి కేటీఆర్ అన్నారు.