ఇన్సూరెన్స్ కోసం తనకు తానే సుఫారీ… ప్రాణం తీశారు..

భర్త అక్రమ సంబంధం..... భార్య ఆత్మహత్య

ఢిల్లీలో ఘోరం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యాపారి ఎవరూ చేయని సాహసం చేశాడు. తన హత్యకు ప్లాన్ చేసి తనను తాను హత్య చేయించుకోడానికి ముగ్గురు వ్యక్తులకు సుఫారీ ఇచ్చాడు. కాగా ఈ ఘటనకు సంబందించిన వివరాలను ఓసారి చూద్దాం. ఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న షాను బన్సాల్ అనే మహిళ తన భర్త కనిపించకుండా పోయాడని జూన్ 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిత్యావసర వస్తువులకు సంబంధించిన వ్యాపారం చేసే తన భర్త గౌరవ్ జూన్ 9న ఇంట్లో నుంచి పనిమీద బయటకు వెళ్లాడని ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదేవిధంగా షాను బన్సాల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఢిల్లీ శివార్లలోని రన్‌హౌలా ప్రాంతంలో గౌరవ్ మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో భాగంగా గౌరవ్ సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. దీంతో పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. గౌరవ్ తనను తాను చంపించుకోవడానికి ఓ మైనర్ బాలుడితో జరిపిన ఫోన్ సంభాషణ ఒకటి వెలుగు చూసింది. దీంతో ఫోన్ సంభాషణ ద్వారా తెలిసిన వివరాలను ఓసారి గమనిస్తే.. జూన్ 9న ఇంటి నుంచి బయల్దేరిన గౌరవ్ ముందే ప్లాన్ చేసుకుని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ద్వారా రన్‌హౌలా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అంతకుముందే తన హత్య కోసం సుఫారీ ఇచ్చిన వ్యక్తులకు తన మొబైల్ ద్వారా తన ఫోటోను పంపించాడు.

కాగా గౌరవ్ అక్కడికి చేరుకోగానే.. నిందితులు అతడి చేతులను వెనక్కి విరిచి కట్టేసి, ఓ చెట్టుకు ఉరివేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ నుంచి సుఫారీ తీసుకొని అతడిని హత్య చేసిన మనోజ్ కుమార్ యాదవ్, సూరజ్, సుమిత్ కుమార్‌ ల తో పాటు మరో మైనర్ బాలుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అసలు ఈ కేసులు ఇన్సూరెన్స్ పాత్ర కీలకంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే అసలు రావాల్సిన ఇన్సూరెన్స్ ఎంత ఉంది. గౌరవ్ తనను హత్య చేయడానికి నిందితులకు సుఫారీగా ఎంత చెల్లించాడు అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించి విచారణ సాగిస్తున్నారు.