Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘రంగస్థలం’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సన్నద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి అయిన ఆ సినిమా రెండవ షెడ్యూల్‌ను అతి త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా మూవీ చిన్న పాటి మల్టీస్టారర్ చిత్రంగా చెప్పుకోవచ్చట. ఎందుకంటే ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు ప్రశాంత్, నవీన్ చంద్రం, ఆర్యన్ రాజేష్‌లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ ముగ్గురు కూడా పలు చిత్రాల్లో హీరోలుగా నటించిన విషయం తెల్సిందే.
బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు వారు అన్నదమ్ముళ్లుగా కనిపించబోతున్నారు. ఒకే సినిమాలో నలుగురు హీరోలు నటించనున్న కారణంగా దీన్ని కూడా మల్టీస్టారర్ అనవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. బోయపాటి శ్రీను చిత్రం తర్వాత జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక మల్టీస్టారర్‌ను చేయబోతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌తో కలిసి చేయబోతున్న ఆ మల్టీస్టారర్‌పై అందరి దృష్టి ఉంది. ఆ పెద్ద మల్టీస్టారర్‌కు ముందు ఇదో సన్నాహక మల్టీస్టారర్ అనుకోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. రామ్ చరణ్, బోయపాటిల కాంబో మూవీలో కైరా అద్వానీ హీరోయిన్గా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.