నందమూరి నటసింహంగా నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రం “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. మరి మాస్ లో భారీ హైప్ లో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు అంతిమ దశకి చేరుకుంటుంది.
దీనితో అయితే ఈ చిత్రం రిలీజ్ కి కూడా దగ్గరకి పడుతూ వస్తుండగా ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే బయటకి వచ్చింది.ఈ చిత్రం నుంచి ఇక నెక్స్ట్ మ్యూజికల్ బ్లాస్ట్ స్టార్ట్ కానున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే అతి త్వరలోనే “భగవంత్ కేసరి” ఫస్ట్ సింగిల్ ని అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.
మరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నథమన్ సంగతి అందరికి తెలిసిందే. అలాగే ఇప్పటికే థమన్ సహా బాలయ్య కి సరైన సాలిడ్ మ్యూజిక్ ట్రాక్ రికార్డు కూడా ఉంది. మరి భగవంత్ కేసరి కి అయితే ఎలాంటి ఆల్బమ్ ని తాను అందిస్తాడో చూడాలి.