International Politics: కుటుంబ సభ్యులను కూడా వదలని పుతిన్ ప్రభుత్వం..

International Politics: Putin's government does not spare even family members..
International Politics: Putin's government does not spare even family members..

రష్యాలోని జైల్లో ఇటీవల వివాదాస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సి నావల్ని కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సి నావల్ని తమ్ముడు ఒలెగ్ నావల్ని పై గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు తోడు అక్కడి ప్రభుత్వం తాజాగా మరో కేసు పెట్టింది. ఈ విషయాన్ని అక్కడి అధికారిక వార్త ఏజెన్సీ టాస్ వెల్లడించింది. అయితే ఏ సెక్షన్ కి ఎందుకు పై కేసు పెట్టారు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. కేసు నమోదు అయిన వెంటనే పోలీసులు ఒలెగ్ కోసం గాలింపులు చేపట్టారు.

ఇప్పటికే ఒలెగ్ పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో ఒక ఫ్రాడ్ కేసులో మూడున్నర సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అప్పట్లో అన్నా అలెక్సి పై ఒత్తిడి పెంచడానికి అతని తమ్ముడు ఒలెగ్ పై అక్రమ కేసులు మోపిందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అలెక్సి మరణం పై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అలెక్సిమరణానికి పుతిన్ కారణమన్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అలెక్సీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన భార్య ఇప్పటికే ప్రతిజ్ఞ కూడా చేసింది.