International Politics: వైరస్ హెపటైటిస్‌ వల్ల రోజుకు 3,500 మంది బలి.. హెచ్చరించిన WHO

International Politics: WHO has warned that 3,500 people die every day due to viral hepatitis
International Politics: WHO has warned that 3,500 people die every day due to viral hepatitis

వైరస్ హెపటైటిస్‌ వల్ల చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. మరణాల విషయంలో ఇది క్షయ వ్యాధి స్థాయిలో ఉందని తెలిపింది. వైరల్‌ హెపటైటిస్‌తో 2019లో 11 లక్షల మంది చనిపోయారని వెల్లడించింది. 2022లో దీని మరణాల సంఖ్య 13 లక్షలకు చేరిందని పేర్కొంది.

అందులో హెపటైటిస్‌ బి వల్ల 83 శాతం, హెపటైటిస్‌ సి వల్ల 17 శాతం మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది .ప్రపంచ వ్యాప్తంగా రోజూ ఈ వ్యాధులతో 3,500 మంది చనిపోతున్నారని తెలిపింది. మూడింట రెండొంతుల కేసులు బంగ్లాదేశ్‌, చైనా, ఇథియోపియా, భారత్‌, ఇండోనేసియా, నైజీరియా, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, రష్యా, వియత్నాంలో నమోదు అవుతున్నాయని పేర్కొంది. ఈ దేశాల్లో వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సకు చర్యలు ముమ్మరం చేయాలని ఆ దేశ ప్రభుత్వాలకు WHO సూచించింది.