సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరోసారి విచారణను ఎదుర్కోనుంది. మార్కెట్లో నూతన సంస్థల పోటీని ఎదుర్కోవడానికి వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందన్న అభియోగం పైన విచారణ కొనసాగనుందని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ తెలిపారు. ఇదివరకే ఫేస్‌బుక్ యుఎస్ ఫెడరల్ కమిషన్ దర్యాప్తును ఎదుర్కొంది. ఎంత పెద్ద సంస్థ అయినా చట్టాన్ని గౌరవించాల్సిందేనని, అయితే ఈ అంశంపై ఫేస్‌బుక్ యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు.గతంలో ఫేస్‌బుక్ స్పందిస్తూ ఎవరిపైనా గుత్తాధిపత్యం చేయబోమని.. ఆన్‌లైన్‌లో తమ స్నేహితులను ఏ విధంగా కలుసుకోవాలోనేది వినియోగదారుల స్వేచ్చ మేరకే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.