పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమా ముల్ హక్ భారత ఆటగాళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇంజమాన్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కినట్లైంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే సమయంలో టీమిండియా ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్ల కోసమే సెంచరీలు చేసేవారని తెలిపాడు. అలాగే.. పాకిస్థాన్ ప్లేయర్లు టీమ్ కోసం ఆడితే.. భారత ఆటగాళ్లు సొంత ప్రయోజనాల కోసమే ఆడేవారని అన్నాడు.
తాజాగా మాజీ కెప్టెన్ రమీజ్ రాజాతో మాట్లాడే సమయంలో ఇంజమామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.` భారత్‌తో ఆడే సమయంలో వారి బ్యాటింగ్ లైనప్ పేపర్‌పై మాకంటే బలంగా ఉండేది. మా వాళ్లు 30, 40 పరుగులు చేసినా అవి జట్టు కోసం చేసేవారు. కానీ వాళ్లు అలా కాదు. సెంచరీలు చేసినా అవి వాళ్ల ప్రయోజనాల కోసమే చేసేవారు. ఇరు జట్ల మధ్య అదే తేడా అంటూ ఇంజమామ్ అన్నాడు. తన తొలి కెప్టెన్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కెరీర్ ఆరంభంలో యువ ఆటగాళ్లు నిలదొక్కుకునేందుకు విరివిగా అవకాశాలిచ్చేవాడని కూడా వివరించాడు.