యాపిల్‌ ఐఫోన్‌లపై బంపరాఫర్లు

యాపిల్‌ ఐఫోన్‌లపై బంపరాఫర్లు

ప్రముఖ దేశీయ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ యాపిల్‌ ఐఫోన్‌లపై బంపరాఫర్లు ప్రకటించింది. ఐఫోన్‌11, ఐఫోన్‌ ఎస్‌ఈపై భారీ డిస్కౌంట‍్లతో పాటు, ఎక్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది.పలు రిపోర్ట్‌ల ప్రకారం..టెక్‌ జెయింట్‌ యాపిల్‌ మార్చి 8న ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో యాపిల్‌ కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. అంతకంటే ముందే మార్కెట్‌లో విడుదల చేసిన పలు ఐఫోన్‌లపై యాపిల్‌ భారీ డిస్కౌంట్‌,ఎక్ఛేంజ్‌ ఆఫర్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఆఫర్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్నట్లు వెల్లడించింది.

ఫ్లిప్‌ కార్ట్‌ మార్చి 4 నుంచి మార్చి 6 వ‌ర‌కు బిగ్ బచత్ ధమాల్ పేరుతో సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌తో పాటు ప్రత్యేకంగా ఐఫోన్ 11, ఐఫోన్‌ ఎస్‌ఈ పై ఆఫర్లకే అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌11 అసలు ధర రూ.32,000 ఉండగా..ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ.17,800కే పొందవచ్చు. ఎక్ఛేంజ్‌ ఆఫర్‌తో పాటు యాక్సిస్‌ కార్డ్‌ వినియోగదారులు ఫోన్‌ కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

అదే సమయంలో మరో ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ సైతం రూ.14,900వరకు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను అందిస్తుంది. మరో యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈని రూ.15,499కే కొనుగోలు చేయోచ్చు. వాస్తవంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ ఎస్‌ఈ ధర రూ.39,900 ఉండగా..రూ.30,299కే యూజర్లకు అందిస్తున్నట్లు తెలిపింది. ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను రూ.14,800కే అందిస‍్తే ఆఫోన్‌ ధర రూ.15,499కే సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌ కార్ట్‌, అమెజాన్‌లో ఐఫోన్‌లపై ఎక‍్చేంజ్‌ ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్‌లో మీరు ఐఫోన్‌ కొనుగోలు చేయాలంటే సింపుల్‌ గా రెండు ఈ కామర్స్‌ సైట‍్లలో మీ ఫోన్‌బ్రాండ్‌ నేమ్‌, మోడల్‌, ఐఎంఈ నెంబర్‌ ఎంటర్‌చేస్తే మీ ఫోన్‌ పై యాపిల్‌ సంస్థ ఎక్ఛేంజ్‌ ఆఫర్‌లో ఎంత ధర పలుకుతుందో తెలుసుకోవచ్చు. ఐఎంఈ నెంబర్‌ కావాలంటే ఫోన్‌లో *#06# డయల్‌ చేసి పొందవచ్చు.