ఐదుగురు ఆట‌గాళ్ల‌కు ఆమోద‌ముద్ర‌

IPL Governing Council on IPL Team Cricketers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఐపీఎల్ ప్రారంభ‌మై ప‌ది సీజ‌న్లు గ‌డిచిపోవ‌డంతో 2018 ఐపీఎల్ కోసం ఆట‌గాళ్లంద‌రికీ వేలం నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కొన్ని ఫ్రాంచైజీలు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను త‌మ వ‌ద్దే అట్టిపెట్టుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర‌గా, మ‌రికొన్ని ఫ్రాంచైజీలు ఐదుగురు ఆట‌గాళ్లను అట్టిపెట్టుకునే విధానాన్ని ప్ర‌తిపాదించాయి. దీనిపై సుదీర్ఘ చ‌ర్చ జరిపిన ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఐదుగురిని అట్టిపెట్టుకునే విధానానికే ఆమోదం తెలిపింది.

ఐదుగురిలో ముగ్గురు భార‌తీయులు, ఇద్ద‌ర విదేశీయులు ఉండాలన్న నిబంధ‌న విధించింది. అలాగే ఒక్కో ఫ్రాంచైజీ ఆట‌గాళ్ల‌కు చెల్లించే మొత్తాన్ని రూ. 66 కోట్ల నుంచి రూ. 80 కోట్ల‌కు పెంచిన‌ట్టు వెల్ల‌డించింది. 2013 ఐపీఎల్ సీజ‌న్ లో చెన్నై, రాజ‌స్థాన్ జ‌ట్లు స్టాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లు రావ‌డంతో 2015లో రెండేళ్ల‌పాటు విధించిన నిషేధం ముగిసింది. 2018 సీజ‌న్ లో ఆ రెండు జ‌ట్లు తిరిగి ఐపీఎల్ లో ఆడ‌డానికి గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆ రెండు జ‌ట్లు… 2015 వ‌ర‌కు ఆడిన జ‌ట్టు నుంచి ఐదుగురు ఆట‌గాళ్ల‌ను త‌మ వ‌ద్ద అట్టిపెట్టుకోవాల‌ని కౌన్సిల్ సూచించింది.