మళ్ళీ జరగనున్న ఐపీఎల్‌

మళ్ళీ జరగనున్న ఐపీఎల్‌

ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగితే ఒక్క నగరానికే పరిమితం చేయాలని కొందరు బీసీసీఐ సీనియర్‌ అధికారులు జీసీ వర్గాలకు సూచించారు. అది ముంబై అయితేనే సౌకర్యంగా ఉంటుందన్నారు. ముంబైలో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలున్నాయి. వాంఖెడే, బ్రబౌర్న్, డీవై పాటిల్‌ స్టేడియాలున్నాయి. దీంతోపాటు రిలయెన్స్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రత్యేకించి మైదానం ఉంది.

అలాగే స్టార్‌ హోటళ్లకు కొదవే లేదు. అయితే ఇదేమీ ఇప్పటి సూచన కాదు. మహారాష్ట్రలో వైరస్‌ సాధారణంగా ఉన్నపుడు చేసిన సూచన… కానీ ఇప్పుడైతే ముంబై పరిస్థితి ఘోరంగా ఉంది. అక్టోబర్‌కల్లా ముంబైలో వైరస్‌ నియంత్రణలోకి వస్తుందన్న ఆశలుంటేనే ఒకే వేదికపై ఐపీఎల్‌ నిర్వహించాలన్న సూచనను జీసీ పరిశీలిస్తుంది.