Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనకు సోకిన వ్యాధి గురించి వెల్లడించాడు. తనకు నాడీ సంబధమైన వ్యాధిసోకిందని, దీన్ని వైద్యపరిభాషలో న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ అంటారని, ఇది అత్యంత అరుదైన వ్యాధని ఆయన ట్విట్టర్ లో తెలియజేశాడు. వ్యాధికి చికిత్సకోసం తాను విదేశాలకు వెళ్తున్నానని తెలిపారు. ఇర్ఫాన్ అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని, అదొక క్యాన్సర్ అని సోషల్ మీడియాలో కొన్నిరోజుల పాటు ప్రచారం జరిగింది. దీనిపై ఈ నెల 5న స్పందించిన ఇర్ఫాన్ ఖాన్ తనకు అరుదైన వ్యాధి ఉందని, దీనిపై అందరూ తప్పుడు ప్రచారం చేయొద్దని, ఆ వ్యాధి ఏమిటనే వివరాలు పదిరోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. దాని ప్రకారమే తనకు న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ సోకిందని ట్విట్టర్ లో తెలిపాడు.
ఈ వ్యాధి సోకిన వారికి కణితి నెమ్మదిగా లేదా ఊహించనివిధంగా పెరగొచ్చు. అది శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకొచ్చు. చాలామందికి దీని లక్షణాలు అంత త్వరగా తెలియవు. గుర్తించలేరు. ఏదైనా అనారోగ్యానికి పరీక్షలు చేస్తే ఇది బయటపడుతుంది. చర్మం కందిపోయినట్టుగా కనిపించడం, లేదా రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోవడం జరుగుతాయి. కణితి తీవ్రతను బట్టి రేడియేషన్ లేదా కీమో థెరపీ ద్వారా మాత్రమే చికిత్స అందిస్తారు.