చంద్రబాబు మీద బీజేపీ కక్ష సాధింపు చేయదా?

is bjp trying to corner chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశవ్యాప్తంగా కోల్పోతున్న ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టుకోడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో “సంపర్క్ సమర్ధన్” కార్యక్రమం ఒకటి. ఇందులో భాగంగా nda మిత్రులతో పాటు అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల్ని కలిసి ప్రధాని మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నం చేయడం చూస్తున్నాం. ఆ కోవలోనే బీజేపీ మీద కారాలు మిరియాలు నూరుతున్న శివసేన అధినేత ఉద్ధవ్ ని అమిత్ షా కలిశారు. అయినా శివసేన ఒంటరి పోరుకే సై అంది. ఈ వ్యవహారం గురించి ఎవరు ఏమి అనుకున్నా చంద్రబాబుని ఉడికించడానికి అమిత్ షా అలా తమ దగ్గరకు కూడా వస్తే తాము కూడా ప్రముఖుల జాబితాలో చేరుతామని వైసీపీ అధినేత జగన్ , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనుకున్న మాట నిజమే అట.

రాజకీయ కారణాలతో జగన్ ని బహిరంగంగా కలవకూడదని బీజేపీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మీద వున్న వ్యతిరేకత వల్ల జగన్ కూడా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. కానీ ఆంధ్రాలో కాపుల్ని బేస్ చేసుకుని రాజకీయాలు నడపదలుచుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమను స్వయంగా కలిస్తే బాగుండని పవన్ భావించారు. అందుకు తగ్గట్టు బీజేపీ నుంచి కూడా కొన్ని సంకేతాలు కనిపించాయట. హైదరాబాద్ లో అమిత్ షా ,పవన్ ని కలవడానికి ఓ ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారట. కానీ చంద్రబాబు విషయంలో ఇంకా దూకుడు మంచిది కాదని rss నుంచి వచ్చిన సంకేతాలతో అమిత్ షా ఈ భేటీ ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వైపు మొగ్గు జూపకుండా , ప్రత్యేక కోపం పెంచుకోకుండా ఉంటే వచ్చే ఎన్నికల తరువాత పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవచ్చని rss చేసిన హితవుతో షా వెనక్కి తగ్గారట. అంటే ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు మీద కక్ష సాధింపు మాని , ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచిన పార్టీ తో సయోధ్యకు ప్రయత్నం చేయాలని బీజేపీ భావిస్తున్నట్టుంది. .