హిందూ ముస్లిం భాయీ… భాయీ అని మరో సారి ఋజువు చేశారు !

Lucknow Mankameshwar temple hosts first iftar at UP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భారత్ లోని హిందూ ముస్లిం ఐక్యతకు అద్దం పట్టేలా జరిగిన ఒక విందు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భారత్ లోనే అత్యంత పురాతనమైన శివాలయంగా పేరుగాంచిన ఒక ఆలయంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హిందువులు ముస్లిం సోదరులకు తొలిసారిగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అత్యంత అరుదైన ఈ ఘట్టం ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ప్రముఖ మన్‌కామేశ్వర్ ఆలయంలో ఆవిష్కృత‌మైంది. ప్రాచీన శివాలయాల్లో ఒకటైన మన్‌కామేశ్వర్ ఆలయం గోమతీ నది ఒడ్డున ఉంది. ఆలయానికి చెందిన ఒక సన్యాసిని, ఆలయ ప్రధాన పూజారి ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు.

అయితే హిందూమతానికి చెందిన ఒక సన్యాసిని ఇఫ్తార్ విందు ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి షియా, సున్నీ వర్గాలకు చెందిన ముస్లింలుపెద్దలు ఎత్తున హాజరై విందు ఆరగించారు. మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు. వారికి సైతం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇఫ్తార్ కోసం మందిరానికి చెందిన ముగ్గురు వంటవాళ్లు, వారి సహాయకులు ఉదయం నుంచే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ ఏర్పాటుచేసిన విందుకు స్థానిక తీలే వలీ మసీద్ ఇమామ్ మౌలానా ఫాజులుల్ మాన్నా రెహ్మానీ, మౌలానా సుఫీయాన్ నిజామీ, దారుల్ ఉలూమ్ ఫరంగి మహిళ అధికార ప్రతినిధి, నవాబ్ జఫర్ మీర్ అబ్దుల్లా, నవాబ్ మసూద్ మసూద్ అబ్దుల్లా హాజరయ్యారు. ముస్లింలకు స్వయంగా ఆహారాన్ని ప్రధాన పూజారి వడ్డించడం విశేషం. ఇఫ్తార్ అనంతరం ఈ ఘాట్‌లోనే ఇమామ్ ఆధ్వర్యంలో నమాజ్ కూడా నిర్వహించారు.