ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉంచారు. ఈ అరెస్ట్ గురించి కొందరు సక్రమమే అంటూ కామెంట్ చేయగా, మరికొందరు అక్రమం అంటూ చెబుతున్నారు. ఇంతకీ ఈ అరెస్ట్ వెనుకాల ఉన్నది ఎవరు ?
అయితే ఆంధ్రప్రదేశ్ లోని కొందరు సీనియర్ రాజకీయ నాయకులూ చెబుతున్న విషయం ఏమిటంటే.. ఈ అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉన్నదని సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ కు అనుకోవాలంగా వ్యవహరిస్తూ, టీడీపీని ఏపీలో సమూలంగా నాశనం చేయాలన్నది బీజేపీ ప్లాన్ అంటూ చెప్పడం సంచలనంగా మారింది.ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్షముగా ఉన్న టీడీపీని ప్రజల దృష్టిలో దూరం చేసి ఆ స్థానంలోకి బీజేపీ రావాలన్నది మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయన్నది తెలియాల్సి ఉంది.