యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్, బాహుబలి ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే రాధే శ్యామ్ చిత్రం అనంతరం నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సినిమా చేసేందుకు సిద్దం అయ్యారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం చిత్త యూనిట్ దీపికా పదుకునే ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీపికా పడుకొనే పై డ్రగ్స్ ఆరోపణలు వస్తుండటం తో చిత్ర యూనిట్ ఆందోళన లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెటిజన్లు భారీ స్థాయిలో దీపికా పడుకొనే ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
అయితే పలువురు ప్రభాస్ అభిమానులు సైతం దీపికా పడుకొనే విషయం లో మరొకసారి ఆలోచించాలి అంటూ సూచిస్తున్నారు. ఈ టాలెంటెడ్ బ్యూటీ ఇప్పటి వరకూ కూడా తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కాగా ప్రభాస్ తో రానున్న పాన్ ఇండియన్ సినిమా కోసం కన్ఫర్మ్ కూడా అయింది. మరి ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభం కూడా కాకపోవడం తో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.