విశ్వమంతా కరోనా వైరస్ తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. దేశంలోనూ ఆయా రాష్ట్రాలలో రోజు రోజుకూ కేసులు విపరీతంగా నమోదౌతున్నాయి. కరోనా వైరస్ పై పోరాడటానికి ఏప్రిల్ 14 వరకు దేశమంతా లాక్ డౌన్ లో ఉంటుంది. ఆ తర్వాత వెంటనే అంతా సాధారణం అవుతుందని ఊహించడం చాలా కష్టమని ప్రజారోగ్య నిపుణులు, వైద్యులు, ఎపిడెమియాలజిస్టులు గత కొద్ది రోజులుగా స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో లాక్ డౌన్ ముగుస్తుండటంతో సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరిలో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర, ఏపీ, కేరళతో సహా భారతీయ రాష్ట్రాల సమూహంలో తెలంగాణలో పెద్ద సంఖ్యలో కోవిడ్ -19 కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా అధికారులు విధించిన అన్ని సామాజిక దూర చర్యలను ఒకేసారి ఎత్తివేయడం మంచిది కాదని.. ఏప్రిల్ 14 తర్వాత ఇది మరింత విపత్తుకి దారితీస్తుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య పరస్పర చర్చల్లో.. ఉస్మానియా మెడికల్ కాలేజీ (OMC) నుంచి ప్రసిద్ధ ప్రజారోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు పడాలని.. దూర నిభందనలు అధికంగా పాటించాలని, విపత్తు అధికస్థాయిలో ఉందని వారు వెల్లడించారు.
అంతేకాకుండా మార్చి ప్రారంభ భాగంలో.. రాష్ట్ర ఆరోగ్య అధికారులు హైదరాబాద్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తిరిగి వచ్చిన 25 వేల మంది విదేశీయులతో వ్యవహరించాల్సి వచ్చింది. ఏప్రిల్ 5 నాటికి, వారందరూ తమ తప్పనిసరి 14 రోజుల ఇంటి నిర్బంధాన్ని ముగించారు. అన్ని సక్రమంగా సాగుతున్న సమయంలో ఊహించని విపత్తులా న్యూ ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశంలో 1,000 మందికి పైగా పాల్గొన్న మార్కాజ్ క్లస్టర్‌ను గుర్తించడం జరిగింది. దీంతో రాష్ట్ర ఆరోగ్య అధికారుల సంసిద్ధత నియంత్రణ ప్రణాళిక సవాల్ గా మారింది.
రాబోయే కొద్ది వారాల్లోనే తెలంగాణపై మార్కాజ్ క్లస్టర్ పూర్తి ప్రభావం తెలుస్తుందని హైదరాబాద్ సీనియర్ వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మార్కాజ్ క్లస్టర్ కారణంగా కరోనా వైరస్ కేసులు బాగా పెరిగినందున.. రాష్ట్రాల్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదని నమ్మడం చాలా కష్టమని కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు. మార్కాజ్ క్లస్టర్ ప్రభావాన్ని నిర్ధారించడానికి ఏకైక మార్గం దేశవ్యాప్తంగా విస్తృతమైన పరీక్షలను చేపట్టడమే అని కొందరు అధికారులు వారి అభిప్రాయాలను తెలియజేశారు.