2019 ఎన్నికలకి జనసేన పోటీనా…ఎలా పవన్ ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన రాజకీయ పార్టీ జనసేన. తెలుగు నాట అధికారం కోసం కాదు ప్రశ్నించడానికి అంటూ కొత్త సిద్దంతంతో ముందుకి వచ్చిన పవన్ జనసేన సాంకేతికంగా నాలుగేళ్లు పూర్తిచేసుకుని ఐదో యేట అడుగుపెట్టి ఉండొచ్చు. కానీ వాస్తవికమైన అర్థంలో ఇపుడే అది పూర్తి రాజకీయ స్వరూపం రూపొందించుకుంటోంది. ఇప్పటి వరకు జనసేన మీద రాజకీయంగా అసలు అంచనాలేమీ లేవు. నిర్మాణమే లేదు కాబట్టి ఆ అంచనాలకు అప్పుడే రాలేం. కాకపోతే నాయకుడిగా కూడా ఆయన ఇంతవరకు ప్రత్యేకముద్ర చూపించిన దాఖలాలు కూడా లేవు. అసలు రాజకీయ నాయకుడిగా వ్యవహరించాలని ఇప్పటివరకూ అనుకున్నారా లేదా అనేది కూడా తెలీదు. కానీ ఇటీవల ఆయన మొదలు పెట్టిన ఆరోపణల ట్వీట్ల వస్ర్హం చూస్తే ఆయన కూడా పూర్తి స్థాయి రాజకీయ నాయకునిగా మారేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడని అర్ధమవుతోంది
ఆయన నిర్వహించిన సభలు సినిమాటిక్‌గానే సాగుతాయి సినిమాలో హీరో ప్రవేశం మాదిరే ఆయన వేదిక మీదకు సినిమాటిక్ గానే వస్తారు అంతే సినిమాటిక్‌గా నిష్ర్కమిస్తారు. మధ్యలో కొన్ని పంచ్ డైలాగులు వదులుతారు. పార్టీ పెట్టిన నాలుగు సంవత్సరాల వరకు పార్టీకి కార్యకర్త నుంచి లీడర్ వరకు అన్నీ తానె అని ప్రకటించుకున్న పవన్. ఎట్టకేలకు ఇటీవలే పార్టీ సభత్వ నమోదు ఫోన్ ద్వారా ప్రారంభించారు. ఇంకా సరయిన సభ్యత్వ నమోదె కాలేదు ఇప్పుడు జనసేన తన తలకి మించిన భారాన్నే ఎత్తుకుంది. ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఎంతో కీలక నిర్ణయాన్ని అనూహ్యంగా ఒక యూట్యూబ్ వీడియోలో విడుదల చేసింది. జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేయనున్నట్లు పార్టీ తీర్మానించిందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఈ రోజు తమ పార్టీ తరఫున ప్రకటించారు.
గతకొంత కాలంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దంగా ఉండమని ఇప్పటికే కొంతమందికి సంకేతాలు ఇచ్చాడట ! అయితే తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం తిప్పి కొత్తలేకపోతున్న పవన్ బీజేపీ-వైసీపీతో కలిసి పోటీ చేస్తారేమో అన్న అనుమానం కలిగిస్తోంది. తెలంగాణ లో కూడా మొదట కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ సడెన్ గా యు టర్న్ తీసుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనియాడడం అందరినీ షాక్ కి గురిచేసింది. తెలంగాణ లో కూడా జనసేన పోటీ చేస్తుందని అంటున్నాడు పవన్ అయితే తెలంగాణ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ జనసేన పార్టీ నిర్మాణమే జరగలేదు. కేవలం అభిమానులతో పాటు కొంతమంది యువత మాత్రమే పవన్ వచ్చినపుడు క్రౌడ్ పుల్లింగ్ లేకుండా పనిచేస్తున్నారు. 
అది అభిమానమో.. పిచ్చో మరి ? కనీస అవగాహన కూడా లేని యువత జనసేన కార్యకర్తలమంటూ విర్రవీగుతున్నారు. అసలు పార్టీ అధినేత చెప్పేదేమీ వినకుండా.. సెల్‌ఫోన్లతో సెల్పీలు తీసుకోవడానికి పోటీలు పడతారు. పవన్‌తో కరచాలనం చేసేందుకు ఆరాటపడుతున్నారు. పార్టీ విధి, విధానాలను జనంలోకి తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుంటే.. అభిమానులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అసలు వీళ్లతో పార్టీ నడపడం సాధ్యమేనా..? భవిష్యత్‌లో జనసేన అధినేత పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు..? ఇల్లు అలకగానే పండుగ కాదు అని ఊరికే అనలేదుగా ఓట్లు రావాలంటే, వచ్చిన వోట్లతో ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పుడున్న జనసేన నిర్మాణం సరిపోదు. ఇలానే వెళ్లి పవన్ ఎన్నికలని ఎలా ఎదురుకుంటాడో మరి చూడాలి ?