2019 ఎన్నిక‌ల్లో పోటీపై జ‌న‌సేన ప్రకటన

Give-A-Missed-Call-For-Membership-To-Pawan-Janasena-Party
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌న‌సేన పోటీచేస్తుంద‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నిక‌ల్లో పోటీచేస్తామ‌ని జ‌న‌సేనాని స్వ‌యంగా ప్ర‌క‌టించారు కూడా……అయితే జ‌న‌సేనాని రాజ‌కీయ కార్యాచర‌ణ అంతా ఏపీ కేంద్రంగానే జ‌రుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఆ పార్టీ పోటీచేయ‌డంపై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ప‌వ‌న్ కు తెలంగాణ లో భారీ సంఖ్య‌లో అభిమానులున్న‌ప్ప‌టికీ…తెలంగాణ‌పై ప‌వ‌న్ పెద్ద‌గా దృష్టిపెట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయ క్షేత్రంలోకి దిగిన త‌ర్వాత‌….కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామిని ద‌ర్శించుకుని ఒక‌టి, రెండు తెలంగాణ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌డం మిన‌హా..మ‌ళ్లీ ఇంత‌వ‌ర‌కు ఆయ‌న తెలంగాణ ఊసే ఎత్త‌లేదు.
అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన తెలంగాణ‌లో  పోటీచేయదంటూ కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌ర‌గుతోంది. దీంతో ఈ ప్ర‌చారానికి తెర‌దించేందుకు జ‌న‌సేన ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త‌మ పార్టీ పోటీచేస్తుంద‌ని జ‌న‌సేన తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ నేమూరి శంక‌ర్ గౌడ్ ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో అన్ని జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి కార్య‌క‌ర్త‌లు కృషిచేస్తున్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే తాము కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించామ‌ని, ల‌క్ష‌లాదిమంది యువ‌త త‌మ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెనుక ఉన్నార‌ని చెప్పారు. ఆగ‌స్టు లోపు పవ‌న్ జ‌నసేన మ్యానిఫెస్టో ప్ర‌క‌టిస్తార‌ని, జ‌న‌సేన ద‌శ‌, దిశ ఎలా ఉండ‌బోతుందో వివ‌రిస్తార‌ని నేమూరి శంక‌ర్ గౌడ్ చెప్పారు.