Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో సినిమా రాబోతుందని రెండు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు సినిమాను నవంబర్‌లో ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందింది. పవన్‌తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఆ తర్వాత ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ సిద్దం చేస్తాడని, నవంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా గురించి పలు వార్తలు మీడియాలో షికార్లు చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు హీరోయిన్ గురించి వార్తలు రాగా ఇప్పుడు సినిమాలో మరో హీరో కూడా కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
ఇటీవలే ఒక మీడియా సమావేశంలో అవకాశం దక్కితే బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ చిత్రాల్లో తాను నటించాలని కోరుకుంటున్నట్లుగా నారా రోహిత్ చెప్పుకొచ్చాడు. వరుసగా చిత్రాలు చేస్తున్న నారా రోహిత్ ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్‌ను అందుకోవడంలో విఫలం అయ్యాడు. అయినా కూడా తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల చిత్రంలో నారా రోహిత్‌కు న టించే అవకాశం దక్కినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇంకా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్ కానే కాలేదు, అప్పుడే నారా రోహిత్‌కు ఛాన్స్ వచ్చింది అంటూ ప్రచారం జరగడం కాస్త ఓవర్. సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయమై కాస్త అతిగా ప్రచారం జరుగుతుంది. ఈ కాంబినేషన్ ఎట్టి పరిస్థితిలో రాదని గట్టి నమ్మకంతో సినీ వర్గాల వారు చెబుతున్నారు.