పి.కె జగన్ కి ఉపయోగమేనా….!

Is PK Plus Or Minus For Jagan mohan reddy

జగన్ పరిస్థితి ఈ మధ్యన కొంచెం బాగోలేదనే చెప్పోచ్చేమో. మొన్న పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించడం, నిన్న కాపుల రిజర్వేషన్ గురించి ఇవ్వడం కష్టం అని మాట్లాడి ముద్రగడ విమర్శలకు గురి కావడం లాంటివి అవుననే చెబుతున్నాయి. అయితే, ఇలాంటి విషయాలు లేవనెత్తే ఆలోచన స్వయంగా జగన్ దేనా అంటే కొంత వరకు కాదని చెప్పొచు. ఎందుకంటే, జగన్ ఈ సారి తన గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ ని కలిసాడు. జూలై 2017 లో జగన్ ప్రశాంత్ కిషోర్ ని కలవడం అప్పటి నుండి ప్రశాంత్ అండ్ టీం దీని మీద వర్క్ అవుట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పి.కె ఎవరో కొందరు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ స్పృహ ఉన్నవారికి తప్ప అందరికీ తెలియకపోవచ్చు. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్త.

ప్రశాంత్ కిషోర్ రైట్ ఛాయిస్ అని చెబుతున్న గతం…

గతంలో, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వెనుక నిలబడి, మోడీ మూడోసారి ముఖ్యమంత్రి అవడానికి ఒక రకంగా కారణమయిన వ్యక్తి. అప్పటి నుండి ముందుకి వచ్చిన ప్రశాంత్ 2014లో మోడీ ప్రధాన మంత్రి అవ్వడంలో కీలక పాత్రే పోషించాడనే చెప్పాలి. అలాగే, 2015 బీహార్ ఎన్నికల్లో కూడా నితీష్ కుమార్ మూడో సారి ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రణాళికలు రచించారు. అదేవిధంగా, 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమరేందర్ సింగ్ ముఖ్యమంత్రి కావడం వెనుక పి.కె అండ్ టీం ఉండడమే కీలకం అని స్వయంగా అమరేందర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.కానీ, అదే యేడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం పి.కె వ్యూహాలు ఫలించలేదు.

మునుపటి గెలుపులని పరిగణనలోకి తీసుకొంటే ప్రశాంత్ వ్యూహానికి అంత శక్తి ఉందనే అంటారు. కానీ, రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన మోడీ మూడోసారి గెలవడం అంత కష్టం కాదేమో అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అలాగే, నితీష్ కూడా రెండు సార్లు గెలిచి, మూడోసారికి పి.కె హెల్ప్ తీసుకున్నారు. అందులోనూ ప్రశాంత్ ది బీహార్ సొంత రాష్ట్రం కావడం వల్ల అక్కడ రాజకీయ పరిస్థితులు తెలిసి ఉండడమే కారణమంటారు. పంజాబ్ అయితే, అమరేందర్ సింగ్ డైరెక్ట్ గా క్రెడిట్ ప్రశాంత్ కి ఇచ్చేసారు. అదేవిధంగా, ఆ గెలుపులు పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగాయే గానే ప్రణాళికల ఫలితం ఏం కాదని అన్నవాళ్లు లేకపోలేదు.

అతని వ్యూహాలు ఫలించడం లేదని చెబుతున్న విషయాలు…

ఇప్పుడు ప్రశాంత్ అండ్ కొ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దృష్టి సారిస్తుంది. జగన్ గెలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. కానీ, ఈ కొన్ని రోజుల్లో జరుగుతున్న పరిణామాలు జగన్ కు అంత కలిసొచ్చేవిగా కనిపించడం లేదు. పి.కె వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ లో విఫలుమవుతున్న విధంగా తెలుస్తుది. జగన్ పనులకి సొంత పార్టీ కార్యకర్తల్లోనే విముఖత కనబడుతుంది. జగన్ విమర్శలను వెనకేసుకొచ్చి, కార్యకర్తలు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రా ప్రాంత రాజకీయాల మీద కొంత పట్టు లేకపోవడం, అనుభవ కొరత, రాష్ట్ర రాజకీయాల విషయం లో జగన్ ని నిలపడం కోసం ప్రశాంత్ సరైన వ్యూహాలు తీర్చిదిద్ధలేక పోతున్నారని ఈ పరిస్థితుల బట్టి అర్ధమవుతుంది. కాగా, ప్రశాంత్ వ్యూహాలను పక్కన పెట్టి సొంత ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారని అన్నవాళ్ళు ఉన్నారు. జగన్ అధికారం కోసం పడే తపనలో ఉన్నాడు. అందువల్ల అందర్నీ నమ్మే ఉద్దేశ్యం లేడని అనిపిస్తుంది. కానీ, ఆఖరికి జగన్ నిలుస్తాడా..! అసలు ప్రశాంత్ కిషోర్ జగన్ కి ఉపయోగపడతాడా అన్నది చాలామంది మదిలో మెదులుతున్న విషయం. ఇక చూడాలి… ఇంకా 9 నెలలు వ్యవధి ఉన్న నేపధ్యంలో ఏం జరుగుతుందో….!