గూడచారి రిలీజ్ డేట్ – ఆగస్ట్ 3

goodachari release on August 3

నటీ నటులు : అడివి శేష్, శోభిత తదితరులు
సినిమాటోగ్రఫీ: షానిల్ డియో
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సహ నిర్మాత: వివేక్ కూచిభోట్ల
నిర్మాతలు: అభిషేక్ నామా – టిజి విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్
కథ: అడివి శేష్
దర్శకత్వం: శశికిరణ్ తిక్క.

క్షణం వంటి హిట్ తరువాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’. దర్శకుడు శశికిరణ్ స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీతో శోభితా ధూళిపాళ్ల కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా, టి.జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని ఇటీవల సమంత విడుదల చేశారు. ఆ ఒక్క టీజర్‌తోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

టేకింగ్, మేకింగ్ పరంగా హాలీవుడ్ చిత్రానికి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, సుప్రియ, రవిప్రకాష్ ముఖ్యపాత్రల్లో నటించారు. బిజినెస్ పరంగా ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు. ఏ కె ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఆగస్టు 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. పాజిటివ్ బజ్‌తో వస్తున్న ‘గూఢచారి’ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్‌తో సింగిల్ కట్ కూడా లేకుండా సెన్సార్ క్లియర్ చేసుకుంది.