సినిమాలో ప్రభాస్ డ్యాన్స్‌లు చూసి ఎన్నాళ్లయింది. ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ సమస్య ఏమిటి? ప్రభాస్‌కు మోకాలు సమస్యే అసలు సమస్య. ఇన్నాళ్లూ మందులు, ఇంజెక్షన్లతో నెట్టుకువస్తున్నారు ప్రభాస్. మూడు నెలలకు, ఆరు నెలలకు విదేశాలకు వెళ్లి తాత్కాలిక చికిత్స చేయించుకుని వస్తున్నారు. ఇకపై ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం సలార్ ప్రాజెక్ట్ కె పనుల్లో బిజీగా ఉన్నారు ఈ పనులు పూర్తి కాగానే సర్జరీ చేయించుకుని రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.బాహుబలి సినిమా ప్రభాస్ కు పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది.
కానీ అదే బాహుబలి సినిమా ఈ మోకాలు సమస్యను కూడా బహుమతిగా ఇచ్చింది. రోప్ ఫైట్ల వల్ల వచ్చిన సమస్య ఇది. ఆ మధ్య అయితే పక్కన మనిషి పట్టుకుంటే తప్ప ప్రకాష్ నడవలేక పోయారు. ఆదిపురుష టీజర్ లాంచ్ టైం లో ఇది క్లియర్ గా తెలిసింది..
ఇంట్లో అయితే ప్రభాస్ హ్యాండ్ స్టిక్ సాయం తీసుకుంటారని, మోకాలిపై భారం పడనివ్వరని వార్తలు వినిపించాయి.మోకాలి సమస్య వచ్చినప్పటి నుంచి ప్రభాస్ పాటల్లో డ్యాన్స్ చేయడం అన్నది తగ్గిపోయింది.
ఇప్పుడు చేస్తున్న సెలార్. ప్రాజెక్ట్ కె రెండు పాటలకు అంతగా ప్రాముఖ్యత ఉన్న సినిమాలు కాదు. కానీ మారుతి దర్శకత్వంలోని సినిమాలో అయిదు పాటలు వుంటాయి. కనీసం రెండింటిలోనైనా డ్యాన్స్ చేయాల్సి వుంటుంది. చేయాలని ప్రభాస్ కూడా చాలా ఆసక్తిగా వున్నారని తెలుస్తోంది. సర్జరీ అయిపోతే ఆయన కోరిక తీరుతుంది. ఇటు ఫ్యాన్స్ కోరిక తీరుతుంది. .