పివి సింధు బయోపిక్ చేయబోతున్న ప్రముఖ నటి సమంత?

పివి సింధు బయోపిక్ చేయబోతున్న ప్రముఖ నటి సమంత?

ఇటివలే జరిగిన ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటిలలో స్వర్ణం గెలిచి మరొకసారి తనేంటో నిరుపించుకున్న పివి సింధు భారత దేశ కీర్తి పతాకాన్ని ఎగర వేసింది.ఎందరో యువతులకు ఆదర్శంగా నిలుస్తున్న సింధు జీవిత చిత్రాన్నినిర్మించాలని కొందరు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.సింధు జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకులు.ప్రముఖ విలక్షణ నటుడు సోనోసూద్ సింధు జీవిత చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నారు.

ఇందుకోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ అక్కినేని సమంతను కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.సోనుసూద్ కూడా ఇందుకు సమ్మతించారనే వార్తలు వినిపిస్తున్నాయి.సమంతా తో కూడా చర్చలు జరుగుతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతలోనే సింధు ఇటివలే జరిగిన ఒక సమావేశం లో తన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోనే నటిస్తే బాగుంటుందని తన మనసులోని మాటని చెప్పింది. దీపికా కూడా బాగా ఆడుతుందని, అంతే కాకుండా తను ఒక మంచి నటి కూడా అని ప్రస్తావించింది. దీంతో ఈ అంశం  చర్చనీయాంశంగా మారింది.