నేటి నుంచి ప్రారంబించబోతున్న జియో ఫైబర్ సేవలు

నేటి నుంచి ప్రారంబించబోతున్న జియో ఫైబర్ సేవలు

రిలయన్స్ జియో ఫైబర్ సేవలు నేటి నుంచి అందనున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రర్ చేసుకున్న వినియోగదారులు గురువారం నుంచి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ హోం సొల్యూషన్ పొందనున్నారు. ఈ మేరకు జియో ఫైబర్ గురించిన ప్రకటనను ఆగస్టు 12న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

జియో ఫైబర్ ప్లాన్స్:

ప్రీమియం వినియోగదారులకు జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు నెలకు రూ. 700 నుంచి రూ. 10వేల వరకు ఉండనున్నాయి. ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను ప్రీపెయిడ్ రూపంలో అందిస్తామని, భవిష్యత్‌లో పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని జియో వివరించింది

లోకల్, ఎస్టీడీ సేవలతోపాటు ఓటీటీ కంటెంట్ కూడా ఉచితంగా అందిస్తోంది. ఓటీటీలో ఏం వస్తాయనేది ఇంకా స్పష్టత లేదు. కానీ, జియో సినిమా, జియోటీవీ, జియో సావన్ లాంటి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అంతేగాక, జియో ప్రీమియం జియోఫైబర్ కస్టమర్లకు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సేవలను కూడా అందిస్తోంది