వీడిన 7 ఏళ్ల బాలుడి మిస్సింగ్ మిస్టరీ

వీడిన 7 ఏళ్ల బాలుడి మిస్సింగ్ మిస్టరీ

వరంగల్ ఎంజీఎం  మిస్ అయిన  7 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసును వరంగల్ పోలీసులు ఛేదించారు.  7 ఏళ్ల యశ్వంత కిడ్నాప్ కేస్ లోసంగెం మండలం,కాట్రపల్లి కి చెందిన అరుణ రామస్వామి దంపతులు,మొండ్రాయి కి చెందిన సునీత శ్రీనివాస్ దంపతులను అరెస్ట్ చేశారు. ఎంజీఎం యశ్వంత్ మిస్ అయిన తర్వాత తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు   దర్యాప్తు  పోలీసులు నిందితులను గుర్తించారు.

ఎంజీఎం లోని సీసీ కెమెరాల ఆధారంగా లోకల్ పోలీస్, ccs పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసు 3 బృందాలు గా ఏర్పడి కేస్ ను ఛేదించారు. పోలీసుల నిఘా పెరగడంతో నిందితులు కిడ్నప్ చేసిన నిందితులు   వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీసు లో దగ్గర 3 రోజుల తర్వాత  వదిలివెళ్లారు ..బాలుడిని చేరదీసిన పోలీసులు..  యశ్వంత్ ఇచ్చిన సమాచారం మేరకు సంగెం మండలం,కాట్రపల్లి కి చెందిన అరుణ రామస్వామి దంపతులు, మొండ్రాయి కి చెందిన సునీత శ్రీనివాస దంపతులను  మట్టేవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సునీత అనే మహిళ సికేఎం లో స్వీపర్ గా పనిచేస్తుందని అరుణ వారి భర్త రామస్వామి కిడ్నాప్ చేసి అమ్మడానికి ప్రయత్నం చేసి పథకం ప్రకారం హైదరాబాద్ లోని మహేందర్ కి అమ్మడానికి ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు. బాలుడి మిసింగ్ పై మీడియాలో వచ్చిన కథనాలను చూసి బాలుడిని అమ్మితే చిక్కిల్లో పడాల్సివస్తుంది భయపడ్డ నిందితులు బాబును వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో వదిలివెళ్లారని పోలీసులు తెలిపారు, ఈ కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు తేలాల్సి వుందని ఇంకా దర్యాప్తు కొనసాగుతుందన్నారు.