34లక్షల దొంగనోట్లు స్వాధీనం

34లక్షల దొంగనోట్లు స్వాధీనం
దొంగనొట్లు తయారు చేయడమే కాకుండా వాటిని తెలివిగా గ్రామీణ ప్రాంతాలలో వాటిని చలామణీ చేస్తున్న ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసారు.వారి వద్ద నుంచి 34లక్షల విలువైన నకిలీ నోట్ల ను స్వాదీనం చేసుకున్నారు.  నకిలీ నోట్ల ను తయారు చేయడమే కాకుండా వాటిని అనుమానం రాకుండా గ్రామీణ ప్రాంతాలలో చలామణి చేస్తున్న ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసారు. ఏలూరు కు చెందిన మురళి కృష్ణ టెక్నీకల్ గా తెలివైన వాడు.అయితే అతను దానిని అడ్డదారులలో నడిపించాడు.తనకున్నతెలివితో దొంగనోట్లను తయారు చేసి వాటిని చలామణి చేస్తుండగా గతంలో రేపల్లి పోలీసులు అరెస్ట్ చేసారు.తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.
తర్వాత తనకు తెలిసిన మిత్రులతో కలసి నకిలీ నోట్లను తయారు చేసి చలమణి చేయడానికి నిర్ణయించుకోని జంఘారెడ్డిపేట లో ఓగది అద్దెకు  తీసుకోని కర్నూలు,నెల్లూరు,ప్రకాశం జిల్లాలకు చెందిన తన మిత్రులతో కలసి సుమారు 35లక్షల విలువైన నోట్లను ముద్రించి వాటి ని రూరల్ ప్రాంతంలో చలమాణి చేయడానికి నిశ్చయించుకున్నాడు.తమ వ్యూహం ప్రకారం ముందుగా నెల్లూరు జిల్లాలో రోయ్యల గుంట్ల వద్ద కూలీల ద్వారా చలమణి చేయడానికి వచ్చి పోలీసులకు పట్టు బడ్డారు.ముందుగా నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  తర్వాత  మొత్తం గ్రూపులోని సభ్యులు పదిమందిని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి వారి వద్ద నుంచి 34లక్షల విలువైన నోట్ల ను స్వాదీనం చేసుకున్నారు.