ఇక విజయ్ ఒంటరేనా… TVK దారెటు..?

TVK విజయ్
TVK విజయ్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కి ఒంటరి పోరు తప్పదా?.. ఆయనతో కలిసొచ్చే పార్టీలు కరువయ్యాయా?.. అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు. ఇన్నాళ్లూ బీజేపీకి దూరంగా వున్న అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి.. బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో మంగళవారం రాత్రి ఢిల్లీలో భేటీ అయిన విషయం తెలిసిందే. కూటమి గురించి మాట్లాడలేదంటూ ఆయన చెబుతున్నప్పటికీ, అది తప్ప మరొక అవసరమేమీ ఆ నేతల భేటీకి కారణం ఏదీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విజయ్‌ దారెటు అన్నదానిపై ఆయన అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.