సీఎం జగన్ పర్యటనపై ఇజ్రాయెల్ రాయబారి ట్వీట్ !

Israeli ambassador tweeted on CM pics tour!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. మూడ్రోజుల పాటూ ముఖ్యమంత్రి జెరూసలెంతో పాటూ హడేరాలో పర్యటించారు. సోమవారం ఉదయం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. జగన్ పర్యటనపై ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా స్పందించారు. ఏపీ సీఎం పర్యటనపై ట్వీట్ చేశారు. జగన్ తమ దేశానికి రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మల్కా తన ట్వీట్‌లో ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇజ్రాయెల్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని తెలిసింది.. ఎంతో ఆనందంగా ఉంది. పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్‌లోని హెడ్రాలో ఉన్న ఉప్పు నీటి నుంచి మంచినీటి తయారు చేసే కేంద్రం (H21D డీశాలినేషన్ ప్లాంట్)ను సందర్శించారు.

మన భాగస్వామ్యంలో నీరు చాలా ముఖ్యమైనది.. నీటిని శుద్ధి చేసే విషయంలో.. ఇజ్రాయెల్ టెక్నాలజీని మా స్నేహితులతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు’. జగన్ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా హెడ్రాలో ఉన్న ఉప్పునీటి నుంచి మంచినీటి తయారు చేసే కేంద్రం (H21D డీశాలినేష ప్లాంట్)ను సందర్శించారు.

ప్లాంట్ ఏర్పాటు, ఖర్చు, నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్‌లో ఉప్పు నీరును డీశాలినేషన్‌ ద్వారా మంచి నీరుగా మార్చే పద్దతి గురించి వివరాలు ఆరా తీశారు.. తర్వాత ఆ నీటిని జగన్ తాగి చూశారు.