హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. ముందుగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పరిపాలనలో విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. అయితే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

