మే నెల చివరికి 4 కోట్ల ఫోన్లు మాయం. ఇది నిజమా?

కరోనా వైరస్‌ తెచ్చిన తిప్పలు అంతా ఇంతా కాదు. అదేమంటే.. కరోనా వైరస్ ను పూర్తిగా అణచి వేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా.. మే నెల చివరినాటికి దేశంలోని 4కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు మాయం కానున్నట్లు తెలుస్తోంది. నిజమే.. అది అక్షరాలా నిజం కానుంది ఈ న్యూస్. హాండ్ సెట్ లలో వచ్చే లోపాలు, బ్రేక్ డౌన్ లు వంటి కారణంగా అవి ఉపయోగపడక పోవచ్చనేది నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. ఇదే విష‌యాన్ని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ తెలిపింది.

కాగా మొబైల్ ఫోన్ల విడి భాగాలు అందుబాటులో లేకపోవడం, కొత్త హ్యాండ్‌సెట్ల విక్రయాలపై ఆంక్షల కారణంగా ఇప్పటికే దాదాపు 2.5 కోట్ల మంది ఫోన్లు నిరుపయోగంగా మారాయని అంచనా వేసింది. అంతేకాకుండా హ్యాండ్‌సెట్లలో వచ్చే లోపాలు.. బ్రేక్‌డౌన్ల వంటి వాటి ద్వారా మరికొన్ని మొబైల్స్‌ నిరుపయోగంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే.. దేశంలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని.. నెలకు 2.5 కోట్ల పోన్ల అమ్మకాలు జ‌రుగుతున్న‌ట్లు ఆ అసోసియేషన్ తెలపడం విశేషం.